హోలుగుంద: నేలకొరిగిన వరి పంట
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హోళగుంద మండలంలోని నాగర కన్వి, వందవాగిలి, ఇంగలదాహాల్, గజ్జహళ్లి, తదితర గ్రామాలలో వరి పంట నేలకొరిగింది. శుక్రవారం బాధిత రైతులు మాట్లాడుతూ. 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు కంకిపై ఉన్న వరి పంట నీటితో బరువెక్కి ఈదురు గాలులకు నేలకు ఒరిగిపోయింది. పంట నీటిలో నాని కంకులకు, మొలక వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.