కోవెలకుంట్ల పోలీసు సర్కిల్ పరిధిలోని మూడు స్టేషన్లకు ఎస్సైలను నియమిస్తూ జిల్లా పోలీసు అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవెలకుంట్ల ఎస్సైగా పనిచేస్తున్న వరప్రసాద్ రుద్రవరం పీఎస్ కు బదిలీ కాగా, ఆ స్థానంలో ముడివేడు ఎస్సైగా పనిచేస్తున్న పి. మల్లికార్జునరెడ్డిని నియమించారు. మండలంలోని రేవనూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రామ్మోహన్ రెడ్డిని మహానంది పీఎస్ కు బదిలీ చేశారు.