సంజామల ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్ డి. మునిరాజు ఉత్తమ వార్డెన్ గా ఎంపికయ్యారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని నంద్యాలలో ఏర్పాటు చేసిన పరేడ్ గ్రౌండ్ లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి చేతుల మీదగా వార్డెన్ మునిరాజు ఉత్తమ ప్రతిభ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో ఆయనకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు.