బనగానపల్లెలో ప్లాస్టిక్ కవర్లు వద్దు పేపర్ కవర్లు ముద్దు
బనగానపల్లె పట్టణంలో సకల మానవాళి మనుగడకు ప్రమాద కారిగా మారిన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేసి, పచ్చదనం పెంపొందించి భావితరాలకు ఆరోగ్య కరమైన సమాజం అందించాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర నా బనగానపల్లె నా ఆరోగ్యం కార్యక్రమం చేపట్టారు. సోమవారం నాడు పట్టణంలోని కేజీఆర్ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు.