రానున్నది కూటమి ప్రభుత్వమే: కోట్ల

83చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి మంచి ఆదరణ చూపారని, రానున్నది కూటమి ప్రభుత్వమే అని కేంద్ర మాజీ రైల్వే సహాయ మంత్రి, నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెదేపా కార్యాలయంలో పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్