సుంకేసుల డ్యాంకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

83చూసినవారు
తుంగభద్ర రిజర్వాయర్ కు మళ్లీ వరదనీరు పోటెత్తింది. ఆదివారం ఉదయం కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జలాశయానికి 95, 570 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో, 22 గేట్లు ఎత్తి 93, 324 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కెనాల్ కు 2, 095 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు, 0. 954 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్