మంచి ప్రభుత్వం అని చెప్పకునేంత గొప్ప పాలన ఏమి చేశారని కర్నూలు జిల్లాలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. శుక్రవారం ఆయన కర్నూలులో మాట్లాడారు. 100 రోజుల పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. అలాంటప్పుడు మంచి పాలన ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ఇంటికి వచ్చి స్టిక్కర్లను అంటించే టీడీపీ నాయకులను తరిమికొట్టాలన్నారు.