కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద నవంబరు నెలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిందని జడ్పీ సీఈవో జి. నాసరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం బ్యాంకులకు దీపావళి సెలవు కావడంతో ఒక్కరోజు ముందే నిధులు విడుదల చేసింది. నవంబరు 1న ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో 4, 58, 404 పింఛన్లకు రూ. 194. 49 కోట్లు మంజూరయ్యాయి.