కౌతాళం మండలం కామవరం గ్రామ వీఆర్వో నరసింహులుపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతు సురేష్ సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ లో ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ కు ఫిర్యాదు చేశారు. తన భూ రికార్డుల వివరాలను అందజేయాలని పలుమార్లు వీఆర్వోను ఆశ్రయించినప్పటికీ.. ఏదో ఒక సాకుతో తనను తిప్పుకుంటున్నాడని అన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు.