మంత్రాలయం: వసూళ్లకు పాల్పడిన తలారిపై చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
పెద్దకడబూరు మండలం హులికన్వి గ్రామ తలారి తిక్కయ్య అక్రమ వసూళ్లపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోలేదని బాధిత రైతులు శనివారం ఆర్ఐ జెర్మియాను కలిసి నిలదీశారు. పట్టాదారు పాసుపుస్తకాలు, పంటల బీమా, కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇప్పిస్తానని ఏకంగా ఏడుగురి రైతుల నుంచి రూ. 4. 52 లక్షలను అక్రమంగా వసూలు చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తలారిని సస్పెండ్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్