మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం కామవరంలో బైక్ పై అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని ఆదోని ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్కే సైదులు శనివారం తెలిపారు. వారు మాట్లాడారు. కామవరంలో బోయ రమేశ్ అనే వ్యక్తి బైక్ మీద 192 ప్యాకెట్లు రెండు బాక్స్ ల కర్ణాటక మద్యం తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, బైక్ ను సీజ్ చేశామన్నారు.