ఎమ్మిగనూరు పట్టణ ప్రజల ఆరాధ్యదైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వివర్స్ కాలనీ క్రీడా మైదానంలో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమాన్నిగురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎద్దులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని, వాటి ప్రాముఖ్యత తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.