ఆస్పత్రుల పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య అన్నారు. పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన పెద్ద మాలిక్ భాషకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన రూ. 61, 608/-, సంబంధించిన చెక్కులు ఎమ్మెల్యే జయసూర్య గురువారం అందజేశారు.