కేంద్ర మంత్రిని కలిసిన నంద్యాల ఎంపీ శబరి

64చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన నంద్యాల ఎంపీ శబరి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఢిల్లీలోని క్యాంపు కార్యాలయంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం సమావేశం అయ్యారు. నంద్యాల జిల్లాలో నిర్మాణంలో ఉన్న కర్నూలు-దోర్నాల 340-c జాతీయ రహదారి, నిర్మాణం చేపట్టాల్సిన కల్వకుర్తి-నంద్యాల, నంద్యాల-జమ్మలమడుగు 167k జాతీయ రహదారుల వెంట భూసేకరణ, రైతుల భూముల నష్టపరిహారం, రైతుల అభ్యంతరాలు, జాతీయ రహదారుల కింద అండర్ పాస్ రోడ్లు, రోడ్డు అలైన్మెంట్ మార్పులు, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్