పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలంలో వైకే తాండ కొండ ప్రాంతంలో ఎక్సైజ్ ఎస్సై బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడారు. నంద్యాల ఎక్సైజ్ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు నాటుసారా కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఏమైనా సమాచారం ఉంటే 8008828467, 9440902586 ఫోన్ నంబర్లకు తెలుపగలరు.