పాణ్యం నియోజకవర్గంలో విద్యుత్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్సీపీ నిర్వహించిన పోరుబాటకు వైసీపీ శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, విద్యుత్ ఎస్ఈకి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. పెంచిన కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యత్ కొసాగించాలన్నారు.