పాణ్యం: రేపు కాల్వబుగ్గకు రానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గలో వెలసిన శ్రీబుగ్గ రామేశ్వర ఆలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న కార్తీక వనభోజన మహోత్సవంలో రాష్ట్ర మంత్రులు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ హాజరుకానున్నారని సీఐ చంద్రబాబు, ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను కాల్వబుగ్గలో సీఐ, ఆలయ ఈవో మద్దిలేటి తో కలిసి పరిశీలించారు.