వరద బాధితులకు ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళం

75చూసినవారు
వరద బాధితులకు ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళం
నంద్యాల జిల్లా మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ. 76, 662 రూపాయలను వరద బాధితుల సహాయార్థంగా ఇవ్వనున్నట్లు మహానంది దేవస్థానం రెగ్యులర్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రవిశంకర అవధాని బుధవారం తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖలోని 11 ప్రధాన దేవస్థానాల నుంచి వరద బాధితుల సహాయార్థం 1రోజు వేతనం ఇవ్వడానికి ప్రధాన దేవస్థానాల యూనియన్ అధ్యక్షులు హరిబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్