కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో జరుగుతున్న సాగునీటి ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. శనివారం మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నీటి సంఘం ఎన్నికలను రద్దు చేయాలని చెన్నకేశవరెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికల బూత్ ల్లో టీడీపీ నేతలే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.