ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కలిగిరి, కొండాపురం, జలదంకి, మర్రిపాడు, సంఘం, గుడ్లూరు, కందుకూరు, ఉలవపాడు, అల్లూరు, దగదర్తి మండలాల్లో ఉదయం నుంచి ఆకాశం నల్లటి కారుమబ్బులతో కమ్ముకొని భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ వర్షాలకు కూడా వరి నాట్లు వేస్తున్నారు. పశువుల కాపరులు, చెట్ల కింద, పూరి గుడిసెల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.