ఓ రెవెన్యూ అధికారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామానికి చెందిన షేక్. హనీఫ్ గత పది రోజుల నుంచి అనారోగ్యంతో నెల్లూరులోని నారాయణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెన్షన్ అందుకోలేక పోయారు. విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ఆదివారం 50 కిలోమీటర్లు ప్రయాణించి నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి వెళ్లి లబ్ధిదారుడికి పెన్షన్ నగదు అందజేశారు.