ఆత్మకూరు మండలం, బండారుపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ సర్పంచ్ ఇప్పగుంట రాజేశ్వరమ్మ బుధవారం “జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం” ప్రారంభించారు. అనంతరం గోడపత్రిక ఆవిష్కరణతో పాటు ఇంటింటికి కరపత్రాలు అందజేసి తదుపరి ట్రై సైకిల్స్, చెత్త డబ్బాలు, సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి. భాస్కరరావు, ఉప సర్పంచ్ కొమ్మి నారాయణ, ఇప్పగుంట పెంచలయ్య నాయుడు, వార్డ్ సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.