భయాన్ని కలిగిస్తున్న సోమశిల ప్రాజెక్ట్ రక్షణ గోడ

76చూసినవారు
భయాన్ని కలిగిస్తున్న సోమశిల ప్రాజెక్ట్ రక్షణ గోడ
సోమశిల ప్రాజెక్ట్ నుంచి నెల్లూరుకు వెళ్లే మార్గాన ప్రాజెక్ట్ ఆఫ్రాన్ ప్రాంత ఎడమవైపు ఉన్న రక్షణ గోడ తీరు ఆందోళన కలిగిస్తుంది. 1979- 80లో కోర్వాల్ గా పిలవబడే రక్షణ గోడ మట్టి కట్టకు లోపల సపోర్టు కోసం నిర్మించారు. సుమారు 100 మీటర్ల 45 అడుగుల ఎత్తు కలిగిన రిటైనింగ్ వాల్ తరహా నిర్మాణం ఇది. నాలుగు దశాబ్దాల పైబడి ఎన్నో వరదలకు, తుఫానులకు దృఢంగా నిలబడింది. ఇటీవల కాలంలో ఇది దెబ్బ తినడం భయాందోళన కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్