జగనన్న ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: ఎమ్మెల్యే

65చూసినవారు
జగనన్న ప్రభుత్వంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. గురువారం మర్రిపాడు మండలం చిన్నమాచనూరు పంచాయతీ పరిధిలోని కదిరినేనిపల్లి, నెర్థనంపాడు, పోలిరెడ్డిపల్లి, చిన్నమాచనూరు గ్రామాల్లో ఎమ్మెల్యే మేకపాటి విజయీభవయాత్రను నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్