నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం

4722చూసినవారు
నెల్లూరు విజయ మహల్ గేటు ప్రాంతంలోని వెంకట్రామాపురంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మంటలు భారీ స్థాయి లో ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి రెండు బీఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మంటలకు చుట్టుపక్కల ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్