కందుకూరు: విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

73చూసినవారు
కందుకూరు: విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
రైతులు నాణ్యమైన ఎరువురు వాడడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ అధికారి రాము అన్నారు. కందుకూరు మండలం పరిధిలోని మహదేవపురం, పలుకూరు గ్రామాల్లో వ్యవసాయ అధికారులు మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టారు. రాము మాట్లాడుతూ రబీ సిజన్లో రైతులకు కావాల్సిన కాక్-2 రకం, జేజి 11 రకం శనగలను పంపిణీ చేస్తున్నామన్నారు. వాటికోసం రైతు సేవ కేంద్రాల్లో రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్