ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కందుకూరు మండలంలోని అన్ని పంచాయతీలలో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పశువైద్యాధికారి సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గొర్రెలు, మేకలు, దూడలు కలిగి ఉన్న పశు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీకాలు కూడా వేస్తున్నట్లు వివరించారు. సోమవారం మాచవరం, కోవూరు పంచాయతీలలో కార్యక్రమం ప్రారంభం అవుతుందని వివరించారు.