నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ ఆలస్యం అయింది. పలుచోట్ల సర్వర్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఏర్పడితే, మరికొన్నిచోట్ల పెన్షన్ పంపిణీ నిర్వాహకుల జాప్యం కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కొందరి పేర్లు వేరే సచివాలయం ఉద్యోగి లాగిన్ లో రావడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.