అల్లూరు మండల ప్రజలకు ఎస్సై కిషోర్ బాబు సూచనలు చేశారు. ప్రజలు తమ నివాసాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏర్పాటు చేసుకొని మాకు చెప్తే కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేస్తామని తెలిపారు. దీని ద్వారా దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు ఊర్లకు వెళ్లే తప్పుడు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తే ఆ ఇంటి పై పోలీసుల నిఘా ఉంటుంది అన్నారు. ఊర్లకు వెళ్ళేటప్పుడు నగలు, డబ్బు తీసుకెళ్లాలన్నారు.