ఈ ఫోటో చూడగానే ఎవరబ్బా ఈ పారిశ్రామికవేత్త ఈ ఫోటో దిగింది అమెరికాలోనో, లేక లండన్ లోనో అనుకుంటున్నారా. అయితే మీరు పొరపాటు పడినట్లే. ఈ ఫోటో ఎక్కడో కాదు కావలి రైతు బజార్ లోనే. ఈయన ఒక కూరగాయల వ్యాపారి. నారా మాలకొండయ్య అనే ఈ వ్యక్తి కావలి రైతు బజార్ లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. చలికాలం కావడంతో సోమవారం కోర్ట్ వేసుకొని కొత్తలుక్ లో కనిపిస్తున్నాడు. ఇతనిని చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.