నెల్లూరు జిల్లా, కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మాగుంట పార్వతమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక గ్రావెల్ కొల్లగొట్టి కోట్లు గడించారని ఎమ్మెల్యే అన్నారు. అక్రమాలన్ని బయటకి తీస్తామన్నారు.