గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెనుకబడిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో పల్లె పండగలో భాగంగా ఆమె శనివారం పర్యటించారు. ఈనెల 21 నుంచి బుచ్చిలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.