మద్యానికి బానిసై కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపం చెందిన షరీఫ్ (22) పండుగపాడులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షరీఫ్ నెల్లూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకొని ఇద్దరు సంతానం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన కారణంగా భార్యతో తరచూ గొడవలు జరిగేవి.ఐదు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లగా షరీఫ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.