నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశాల మేరకు స్థానిక 37 వ డివిజన్ రామ్ నగర్ మూడవ వీధిలోని ఆక్రమణలను బుధవారం తొలగించారు. రోడ్డును ఆక్రమిస్తూ ఇంటి ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతున్నట్లు గతంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేసి ఉన్నారు. అందుకు స్పందించిన కమిషనర్ నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందిని ఆదేశించడంతో ఆక్రమణలు తొలగించారు