ఎండియూ ఆపరేటర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు రేషన్ డీలర్లు తమ సమస్యలను విన్నవిస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ కు నెల్లూరు జిల్లా యునైటెడ్ చౌక ధరల దుకాణదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వెంకటసుబ్బయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.