మండుటెండలోనూ మురుగు నీటి కష్టాలు

1029చూసినవారు
నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అమరా గార్డెన్ ప్రజలకు మండుటెండలోనూ మురుగు నీటి కష్టాలు తప్పడం లేదు. విశ్వభారతి పాఠశాల పక్కనే ఉన్న ప్రధాన మురుగు కాలువ గత ఆరు నెలలుగా దెబ్బతిని ఉంది. దీంతో అమరా గార్డెన్ లో మురుగు నీరు ముందుకు సాగడం లేదు. వీధుల్లో పొంగి ప్రవహిస్తోంది. ఈ మురుగు నీటిలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్