వడ్డే పాలెం కొండపై హనుమజ్జయంతి వేడుకలు

73చూసినవారు
ఉదయగిరి మండలం జి. చెరువుపల్లి, వడ్డే పాలెం, జి. చెర్లోపల్లి గ్రామాలకు మధ్యలో కొండపై వెలసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎంతో చరిత్ర కలిగిన కొండ మీద ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కొరకు ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రాత్రికి భజన కార్యక్రమం ఉంటుందని ఉభయకర్తలు తెలిపారు.

సంబంధిత పోస్ట్