ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో దాసరపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రం చేపట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఉదయగిరి జిల్లాలో నెంబర్ వన్ గా నిలిపే బాధ్యత తీసుకుంటానన్నారు.