నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జోరుగా కోడి పందాలు జరుగుతున్నాయి. మండలంలోని తూర్పు ఎర్రబెల్లి, రేణమాల గ్రామాల్లో బహిరంగంగా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. నిన్న, ఈరోజు బహిరంగంగా కోడిపందాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు కనీసం ఆ వైపు కూడా రాకపోవడం అనుమానాలకు దారి తీస్తుంది. భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. పోలీసుల అనుమతులు ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఐస్ క్రీమ్ బండి సైతం ఇక్కడ ఉండడం విచిత్రం.