నెల్లూరు మాగుంట లేఔట్ లోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఎన్నో వందల కుటుంబాలకు ఆమె ఆరాధ్య దైవం అన్నారు. పేద ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి అని కొనియాడారు. ఆయనతో మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకురి చిరంజీవి రెడ్డి తదితరులు ఉన్నారు.