ఏసీ నగర్ కాలనీ సమస్యలను మేకపాటికి తెలియజేసిన కాలనీవాసులు

85చూసినవారు
ఏసీ నగర్ కాలనీ సమస్యలను మేకపాటికి తెలియజేసిన కాలనీవాసులు
దుత్తలూరు మండల కేంద్రంలోని ఏసి నగర్ కాలనీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం దుత్తలూరులోని వైసీపీ కార్యాలయంలో కాలనీ వాసులు వెంకటేష్, గొల్లపల్లి గిరి ఆధ్వర్యంలో మేకపాటిని కలిశారు. కాలనీలో ఉన్న పలు సమస్యలను మేకపాటి దృష్టికి వారు తీసుకొచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మేకపాటి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్