ఆర్థిక అక్షరాస్యత ఉదయగిరి కేంద్రం ఆధ్వర్యంలో ఉదయగిరి మండలంలోని వడ్డె పాలెం గ్రామంలో శుక్రవారం అవగాహన మరియు చైతన్య పరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆ శాఖ ఉద్యోగులు రామ్మోహన్, హరీష్, శశి ఆధ్వర్యంలో జరిగింది. కళాజాత బృందం ద్వారా గ్రామస్తులకు నాటిక రూపంలో అవగాహన కల్పించారు. వస్తువుకు లాగే మనిషికి కూడా ఇన్సూరెన్స్ అవసరమని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి తెలిపారు.