ఉదయగిరి మండలం వడ్డె పాలెం గ్రామంలో గత ఒకటిన్నర నెల నుంచి ఓ వీధి దీపం వెలగడం లేదు దీంతో చుట్టుపక్కల ప్రజలు రాత్రి సమయాల్లో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా వీధిలైట్లు పంచాయతీ అధికారులు, సర్పంచ్ పరిధిలోకి వస్తుందని విద్యుత్ అధికారులు సమాధానం ఇచ్చారు. సంబంధిత వ్యక్తులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు.