

వెంకటగిరి: గిట్టుబాటు ధర కల్పించాలని వినతి
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర కార్య దర్శి జి. సునీత మాట్లాడుతూ గతేడాది బస్తా రూ. 2400 ఉండగా నేడు రూ. 1650లకు పడిపోయిందని చెప్పారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు.