మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారం

79చూసినవారు
మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారం
మణిపుర్‌లోని అన్ని మార్గాల్లో ఈనెల 8 నుంచి ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని భద్రతాధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత మొదటి సారిగా ఆయన గవర్నర్ అజయ్‌కుమార్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఆర్మీ ఉన్నతాధికారులతో అక్కడి పరిస్థితులపై శనివారం ఢిల్లీలో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్