AP: సూపర్-6 హామీల అమలుపై సీఎం చంద్రబాబు కొత్తరాగం అందుకున్నారని వైసీపీ విమర్శించింది. బయటి నుంచి చూసి సూపర్ సిక్స్ అమలు చేద్దామనుకున్నా.. కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ విమర్శించింది. అప్పులపై కూడా చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది.