వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి
By Nataraju 74చూసినవారువేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రతకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.