క్లౌడ్ పెట్రోల్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేశారని నందిగామ ఏసిపి తిలక్ తెలిపారు. శనివారం జగ్గయ్యపేట పట్టణంలో తపోవన్ పాఠశాల దగ్గర నుంచి ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ డ్రోన్ కెమెరాను ఆపరేట్ చేయుటకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక మహిళ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగిందని తెలిపారు.