పెనుగొలను లో ఘనంగా మాజీ ప్రధాని మొరార్జీ వర్ధంతి

51చూసినవారు
పెనుగొలను లో ఘనంగా మాజీ ప్రధాని మొరార్జీ వర్ధంతి
గంపలగూడెం మండలం పెనుగొలను లో బుధవారం మాజీ ప్రధాని భారతరత్న మొరార్జీ దేశాయి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారతదేశపు మొదటి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా, ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి, బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొరార్జీ‌ నిస్వార్ధంగా పనిచేశారని, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్