తిరువూరులో ఉన్న ఏకైక ఉద్యానవనం అధికారులు, పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పొట్టి శ్రీరాములు పార్కును మూడు సంవత్సరాల క్రితం రూ. 20 లక్షలతో నగర పంచాయతీ అభివృద్ధి చేసింది. కేవలం ప్రహరీ నిర్మించి పిల్లల ఆటలకు అవసరమైన పరికరాలు మాత్రమే అమర్చారు. పేరుకే ఉద్యానవనం తప్ప ఒక్క మొక్క కూడా లేకపోవడం విశేషం. పెద్దలు కూర్చోడానికి బల్లలు లేవు, వాకర్స్ ట్రాక్ లేదని మంగళవారం వాపోతున్నారు.